కేసీఆర్ ​సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు లేరా? : ఎంపీ రఘునందన్​ రావు​

కేసీఆర్ ​సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు లేరా? : ఎంపీ రఘునందన్​ రావు​

మెదక్​, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​కు సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువయ్యారని మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు​ఎద్దేవా చేశారు.  మంగళవారం ఆయన మెదక్​ లో మీడియాతో మాట్లాడారు. టీచర్, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్​ అభ్యర్థులను పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో యువరాజు(కేటీఆర్) సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. బీఆర్ఎస్​కు ప్రజలు ఎప్పుడో వీఆర్ఎస్​ ఇచ్చారన్నారు. దేవిప్రసాద్​ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ టికెట్​ ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ తోక ముడవడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారిందన్నారు. విద్యాధికులంతా బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.